Twins Capital : ప్రపంచంలో ఎక్కువ మంది కవల పిల్లలున్న పట్టణం ఏది ? దీనికి ఆన్సర్.. ‘ఇగ్బో-ఓరా’ !! ఈ స్పెషల్ టౌన్ నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఉంది. ఏటా ‘ప్రపంచ కవలల వేడుక’లను అక్టోబరు 12వ తేదీన నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా ఇగ్బో-ఓరా పట్టణంలో ‘ప్రపంచ కవలల వేడుక’లను ఘనంగా నిర్వహించారు. ఎక్కువ మంది కవలలు ఉన్న పట్టణం అయినందుకు ఇగ్బో-ఓరాకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపును కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమ పట్టణంలో ఎక్కువ మంది కవలలే జన్మిస్తుంటారని.. సింగిల్ ఛైల్డ్ జన్మించడం చాలా అరుదని అంటున్నారు. ఈసారి ‘ప్రపంచ కవలల వేడుక’ల్లో భాగంగా పట్టణానికి చెందిన చాలా మంది కవల పిల్లలు(Twins Capital) ఒకచోటుకు చేరి సందడి చేశారు. అందరూ ఒకే రకమైన డ్రెస్సులను ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా కవల పిల్లలకు టాలెంట్ షోలు నిర్వహించారు.కొందరు కవలలు స్టాండ్స్‌లో కూర్చొని ఈ వేడుకలను వీక్షించారు.
Also Read :Railway Jobs : ఇంటర్ పాసైతే చాలు.. 3693 రైల్వే జాబ్స్
- ఇగ్బో – ఓరా పట్టణంలో ఎవరికైనా కవలలు జన్మిస్తే.. ముందుగా పుట్టినవారికి ‘తైవో’ అని పిలుస్తారు. నైజీరియన్ భాషలో తైవో అంటే ..‘ముందుగా ప్రపంచాన్ని అనుభూతి చెందిన’ అని అర్థం. చివర్లో పుట్టే కవలలను ‘కెహిండే’ అని పిలుస్తారు. నైజీరియన్ భాషలో ‘కెహిండే’ అంటే.. ‘తర్వాత వచ్చిన వారు’ అని అర్థం.
- సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 ప్రసవాల్లో 12 శాతం మంది మాత్రమే కవలలు జన్మిస్తుంటారు. అయితే ఇగ్బో – ఓరా పట్టణంలో అత్యధికంగా ప్రతి 100 ప్రసవాల్లో సగానికి సగం కవలలే జన్మిస్తుండటం గమనార్హం. అక్కడి వైద్యశాలల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
- ఇగ్బో – ఓరా పట్టణంలో కవలలు అంతగా ఎందుకు జన్మిస్తున్నారు ? ఇంతకీ అక్కడి ప్రజలు ఏం తింటారు ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఈ పట్టణం ప్రజలు తమ ఆహారంలో బెండ ఆకుతో తయారు చేసిన ఒక రకమైన సూప్‌ను తాగుతారు. స్థానికంగా పండే ‘యమ్’ అనే దుంపతో చేసిన పిండితో ఇక్కడి ప్రజలు రొట్టెలు చేసుకొని తింటారు. అయితే ఇక్కడ కవలలు ఎక్కువ సంఖ్యలో పుట్టడానికి, ఆహారపు అలవాట్లతో సంబంధం లేదని ఆహార నిపుణులు అంటున్నారు.