Massive Ocean: భూమి లోపల మహా స‌ముద్రం!!

శాస్త్ర‌వేత్త‌లు కొత్త స‌ముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ స‌ముద్రం భూమి పైన కాదు.. భూమికి అత్యంత లోపల ఉండే "కోర్" అనే పొర‌లో దాగి ఉన్న‌ట్లు తేల్చారు.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 09:30 AM IST

శాస్త్ర‌వేత్త‌లు కొత్త స‌ముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ స‌ముద్రం భూమి పైన కాదు.. భూమికి అత్యంత లోపల ఉండే “కోర్” అనే పొర‌లో దాగి ఉన్న‌ట్లు తేల్చారు.భూమి ఉప‌రిత‌లానికి సుమారు 660 కిలోమీట‌ర్ల లోతులో ఆ సముద్రం ఉన్న‌ట్లు గుర్తించారు. భూగర్భంలో ఉన్న మొత్తం నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ వాటర్ ఈ సముద్రంలో ఉందని తెలిపారు.రామన్ స్పెక్ట్రో స్కోపి, ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రో స్కోపిలతో జరిపిన అధ్యయనంలో ఈ కొత్త సముద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 660 మీటర్ల దిగువన వజ్రం ఆకారంలో ఏదో ఉన్నట్లు రామన్ స్పెక్ట్రో స్కోపి, ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రో స్కోపిలతో తెలిసింది. వాటిని నిశితంగా పరిశీలించడంతో అక్కడున్నది ఒక సముద్రమని వెల్లడైంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు చెందిన ఇన్స్‌టిట్యూట్ ఎట్ గోతే యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ కొత్త విష‌యాన్ని వెల్ల‌డించారు.

8 ఏళ్ల క్రితమే..

సరిగ్గా 8 ఏళ్ల క్రితం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.భూ అంతర్భాగంలో సుమారు 410 కి.మీ నుంచి 660 కి.మీ. లోతులో లోయర్ మాంటిల్, అప్పర్ మాంటిల్ పొరల మధ్య భారీ సముద్రం ఉందని అప్పట్లో గుర్తించారు. ఆ మహాసముద్రంలోని నీరంతా కలిపితే ఏకంగా భూమిపై ఉన్న మహా సముద్రాల్లోని నీరంత ఉంటుందట. తమ కు లభించిన భూ అంతర్భాగ ఖనిజం “రింగ్‌వూడైట్ ” లో 1.5 శాతం బరువు నీరే (హైడ్రోజన్,ఆక్సిజన్ అణువులు కలసి ఏర్పడిన హైడ్రాక్సైడ్ అయాన్లు) ఉందని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఆ ఖనిజం ఉత్పత్తి అయిన ప్రాంతంలో నీరు సమృద్ధిగా ఉండవచ్చన్నారు. అంతర్భాగంలో ప్రత్యేకంగా ఉండే ట్రాన్సిషన్ జోన్లలో భారీ ఎత్తున నీరు ఉండొచ్చన్న సిద్ధాంతాలకు ఈ ఖనిజం బలం చేకూర్చిందని 2014లోనే కెనడా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.