Site icon HashtagU Telugu

Aliens: ఏంటి.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలియన్స్ ఉన్నాయా.. ఆ కన్నాలే ప్రూఫా?

Mysterious Holes

Mysterious Holes

సాధరణంగా సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒక దానిపై పరిశోధన చేస్తూనే ఉంటారు. కొన్ని సార్లు చేసిన పరిశోధనలో సక్సెస్ అవుతారు. కొన్ని సార్లు విఫలం అవుతారు. అలా వారు చేసిన పరిశోధనలు కొన్ని నిజం అవుతాయి. మరికొన్ని అబద్ధం అవుతాయి. కొందరు కొన్ని కొన్నిసార్లు తమ పరిశోధనలను ఉహించి కూడా చెబుతుంటారు.అలా తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక విషయాన్ని బయట పెట్టారు. ఆ సముద్ర గర్భంలో వీలుకాని, రహస్యమైన కన్నాలను గుర్తించారు సైంటిస్టులు. ఇక అవి ఒకే లైన్లో ఉండటంతో అదేంటి అని కనిపెట్టే ప్రయత్నం చేశారు. సముద్రంలోకి వెళ్లే వాహనంను సముద్ర గర్భంలోకి పంపారు.

ఇక అక్కడున్న కన్నాలు పర్ఫెక్ట్ లైన్ లో ఉండగా.. ఒక్కో కన్నం మధ్య దూరం సమానంగా ఉంది. ప్రతి కన్నం చుట్టూ కొద్ది మొత్తంలో అవక్షేపాలు కూడా ఉన్నాయి. అంటే అవి అచ్చం మనుషులు డ్రిల్లింగ్ చేసినట్లు ఉన్నాయి. కానీ మనుషులు అక్కడికి వెళ్లి అలా చేసే అవకాశాలు లేవు. దీంతో అవి గ్రహాంతరవాసులే చేసి ఉంటాయి అని ఊహిస్తున్నారు. కానీ ఎంతోమంది సైంటిస్టులు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ రంద్రాలు ఏంటో చెప్పాలని అక్కడ ఉన్నా వారందరిని సైంటిస్టులు సాయం కోరుతున్నారు. ఇక ఇది గ్రహాంతర వాసులు పనినా లేక మనుషులు చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

Exit mobile version