SC:మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం…విద్వేషపూరిత ప్రసంగం కేసులో సుప్రీంకోర్టు దిగ్బ్రాంతి..!!

విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో దేశఅత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసలు జారీ చేయడంతోపాటుగా వారి అధికార పరిధిలో ఇలాంటి నేరాలపై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరింది.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 04:49 AM IST

విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో దేశఅత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసలు జారీ చేయడంతోపాటుగా వారి అధికార పరిధిలో ఇలాంటి నేరాలపై తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరింది. 21వ శతాబ్దంలో లౌకిక దేశంలో ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేంతవరకు వేచిచూడకుండా…చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా దిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా పోలీసులు స్వంతగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాల కేసులో విచారణ సందర్భంగా…విద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా నేరుగా కోర్టుకు వచ్చారా అంటూ పిటిషనర్ కోర్టు ప్రశ్నించింది. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు.

దీనిపై జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం కపిల్ సిబల్ ను ప్రశ్నించింది. మీరు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవేశపూరిత ప్రసంగానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? 21 శతాబ్దంలో ఏం జరుగుతోంది.?మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం?దేవుడిని ఎంత చులకన చేశాం? అని ప్రశ్నించింది. దీంతో కపిల్ సిబాల్ మాట్లాడుతూ..బీజేపీ ఎంపీ ప్రవేశ్ వర్మ ముస్లింలపై బహిష్కరణ గురించి మాట్లాడుతున్నారని..ఇలాంటి కార్యక్రమాల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ముస్లింలు కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారా అంటూ సిబల్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో నిరంతరం జరుగుతున్న రెచ్చగొట్టే ప్రసంగాల ఘటనలపై కోర్టు సెక్యులర్ దేశానికి ఇది చాలా దిగ్బ్రాంతికరమైందన్నారు. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదని తెలిపింది. ఇలాంటి రెచ్చగొట్టె ప్రకటనలు సహించేది లేదన్నది.