Site icon HashtagU Telugu

Muslim boy topped : సంస్కృత ఎగ్జామ్ లో టాపర్ గా ముస్లిం స్టూడెంట్

Sanskrit1

Sanskrit1

ఆ స్టూడెంట్ ఒక ముస్లిం (Muslim boy topped).. అయితేనేం సంస్కృత పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లా జిందాస్‌పూర్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ ఈ ఘనత సాధించాడు. యూపీ సంస్కృత బోర్డు నిర్వహించిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఇర్ఫాన్ టాపర్ గా నిలిచాడు. సంస్కృత ఎగ్జామ్ లో అతడికి 82.71 శాతం మార్కులు వచ్చాయి. సంస్కృత ఎగ్జామ్ లో ప్రతిభ కనబర్చిన ఇర్ఫాన్ తండ్రి సలావుద్దీన్ కూడా బీఏ గ్రాడ్యుయేట్ .. అయితే ఆయన ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. మీడియాతో సలావుద్దీన్‌తో మాట్లాడుతూ.. ” నా కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ లో సంస్కృతం సబ్జెక్టును ఎంచుకున్నప్పుడు.. ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగాను. అయితే మా ఇర్ఫాన్(Muslim boy topped ).. ఏ సమస్యా లేదు నాన్న అన్నాడు. అతడు డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు నేను సంతోషించాను.. వెన్నుతట్టి ప్రోత్సహించాను. మేము ముస్లింలం.. అయినా మా వాడికి సంస్కృతంపై చాలా ఆసక్తి ఉండటాన్ని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి నేను ఇర్ఫాన్ ను ఎన్నడూ అడ్డుకోలేదు” అని వివరించారు.

ALSO READ : మత్తూర్, కర్నాటక- కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం

“హిందువులు మాత్రమే సంస్కృతం చదవాలని.. ముస్లింలు మాత్రమే ఉర్దూ చదవాలనే అభిప్రాయంతో మేం ఏకీభవించడం లేదు. ఒక విద్యార్థి తన పాఠశాల ప్రారంభ రోజులలో అంటే దిగువ తరగతులలో ఈ సబ్జెక్టులను చదివితే.. అతను ఫ్యూచర్ లో తరగతుల్లో కూడా వాటిని ఎంచుకోవచ్చు. ఇందులో తప్పేముంది? నాకు తప్పు ఏమీ కనిపించడం లేదు” అని ఇర్ఫాన్ తండ్రి సలావుద్దీన్ కామెంట్ చేశారు. ఇర్ఫాన్(Muslim boy topped) సంస్కృతంలో మరింత ముందుకు పోయందుకు ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.