చేప చిక్కింది అని సంతోషపడ్డారు.. కానీ తీరా చూస్తే అలా?

సాధారణంగా మత్స్యకారులు నదులలోకి, సముద్రాలలోకి చేపల కోసం వెళ్తూ ఉంటారు. చేపల వేట కోసం వెళ్ళిన వారు

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 05:45 AM IST

సాధారణంగా మత్స్యకారులు నదులలోకి, సముద్రాలలోకి చేపల కోసం వెళ్తూ ఉంటారు. చేపల వేట కోసం వెళ్ళిన వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకునే వరకు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వారికి చావు ఆ చేపల రూపంలో రావచ్చు లేదంటే నీటి రూపంలో రావచ్చు లేదంటే మరి ఏదైనా జీవుల రూపంలో కూడా రావచ్చు. అలా కొన్ని కొన్ని సార్లు మనుషులు మరణిస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ముగ్గురు మహిళలు 100 పౌండ్లు అనగా దాదాపు 45 కిలోల సెయిల్ ఫిష్ ను పట్టుకున్నారు.

అంత పెద్ద చేప దొరకడంతో హమ్మయ్య అంటూ ఆనందంగా తిరిగి ప్రయాణం అవ్వగా ఇంతలోనే ఊహించిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనతో వాళ్ళు షాక్ కు గురయ్యారు. అయితే ఆ షాక్ నుంచి వారు తేరుకునేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలో ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. ఆ మహిళలు ఎంతో కష్టబడి దాదాపుగా 45 కిలోల సెయిల్‌ ఫిష్‌ని పట్టుకున్నారు. అంత పెద్ద చేప దొరకడంతో వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్‌ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు.

అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో వారి పక్కన ఉన్న కేథరిన్‌ పెర్కిన్స్‌ అనే 73 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె ఒక్కసారిగా గొప్ప కూలిపోయింది. వెంటనే అది గమనించిన స్నేహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. జలచరాలలో అత్యంత వేగవంతమైన చేప జాతులలో సెయిల్ ఫిష్ చేప కూడా ఒకటి. ఇవి సముద్రపు అడుగుభాగంలో ఉండడంతో పాటు మనుషులపై కూడా అంతే వేగంగా దాడి చేస్తాయి.