Site icon HashtagU Telugu

Rupee vs Dollar: క్షీణించిన రూపాయి విలువ

Rupee vs Dollar

New Web Story Copy 2023 09 06t172434.109

Rupee vs Dollar: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం క్షీణించింది. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ముడి చమురు ధరలు, అమెరికా డాలర్లకు ఫారెక్స్‌ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్‌ మధ్య రూపాయి బలహీనపడుతున్నది.

బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో రూపాయి 10 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే 83.14 ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా కరెన్సీ బలపడటం రూపాయిపై ప్రభావం చూపాయి. డాలర్ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో భారత రూపాయి క్షీణించిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. రూపాయి ఇంతకు ముందు ఈ ఏడాది ఆగస్టు 21న డాలర్‌కు 83.13 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 83.04 వద్ద ముగిసింది.

Also Read: MLC Kavitha: సోనియా గాంధీకి కవిత సూటి ప్రశ్న, కాంగ్రెస్ వైఖరిపై ధ్వజం