Site icon HashtagU Telugu

Robot Priest Video: పూజారిగా రోబో.. దసరా ఆయుధ పూజ వీడియో వైరల్!

Robo

Robo

రోబోలు శాస్త్ర సాంకేతిక రంగంలోనే ముద్ర వేయడం కాకుండా అన్ని రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే వెయిటర్స్ గా, సరిహద్దుల్లో సైనికులుగా పనిచేసిన రోబోలను మాత్రమే చూశాం. ఇక నుంచి పూజారిగా అవతారమెత్తనున్నాయి రోబోలు. వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించాయి. ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. దుర్గామాతకు హారతి ఇచ్చిన తర్వాత భక్తులు ఆ రోబో వద్దకు వెళ్లి హారతి తీసుకున్న వీడియోలను VIT సంస్థ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.