Site icon HashtagU Telugu

UP: యూపీలో ఉద్రిక్తత…మసీదులో మతగ్రంథాలు దహనం..!!

Up (1)

Up (1)

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మసీదులో మత గ్రంథాలు దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ మోహరించారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వస్తువులకు వీదుల్లో నిప్పంటించి నిరసన తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కబెట్టారు.

మత గ్రంథాలను తగులపబెట్టిన అనంతరం గుర్తు తెలియని దుండగుడు మసీదు నుంచి బయటకు వెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో వందలాది మంది ప్రజలు రోడ్డుపై వచ్చి ఆందోళన చేశారు. దీంతో షాజన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఎస్సీ ఎస్ ఆనంద్ తెలిపారు.

మసీదు దగ్గర నిరసనకారులు ఆందోళన చేపట్టడంతో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.