2000వ సంవత్సరంలో ఎర్రకోటపై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్పాక్ మరణిశిక్షణు సుప్రీంకోర్టు సమర్ధించింది. మహ్మద్ ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2000 డిసెంబర్ 22న ఎర్రకోటపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులతోపాటు ముగ్గురు మరణించారు. ఎర్రకోటపైకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు కూడా భారత సైన్యం జరిపిన దాడుల్లో హతమయ్యారు. 31 అక్టోబర్ 2005న ఎర్రకోటదాడి కేసులో దిగువ కోర్టు ఆరిఫ్ కు మరణశిక్ష విధించింది.
2013లో ఆరిఫ్ మరణశిక్షను సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. దీన్ని తర్వాత మళ్లీ 2014లో కూడా కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పుడు మరోసారి దోషుల శిక్షపై రిష్యూ పిటిషన్ను కొట్టి వేసింది ధర్మాసనం.
2015లో యాకుబ్ మెమన్, ఆరిఫ్ ల పిటిషన్ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇద్దరికీ మరణిశిక్ష, రివ్యూ పిటిషన్ను ఓపెన్ కోర్టులో విచారించాలని ఆదేశించింది. గతంలో రివ్యూ పిటిషన్ను న్యాయమూర్తి తన ఛాంబర్ లో విచారిస్తుండేవారు. మరణశిక్ష విధించిన దోషి రివ్యూ పిటిషన్ , క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరిగి విచారించడం ఇదే మొదటి కేసు అని నిపుణులు అంటున్నారు.