Site icon HashtagU Telugu

Digital Currency : నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!

RBI

RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…ప్రత్యేక ఉపయోగం కోసం డిజిటల్ రూపాయిని త్వరలోనే లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో తన సొంత డిజిటల్ కరెన్సీకి రియాల్టీ రాబోతోంది. టోకు లావాదేవీల కోసం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనుంది ఆర్బిఐ.

ఇదికూడా చదవండి : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!

ఆర్బిఐ ప్రకారం…ఇది భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, చెల్లింపుల వ్యవస్థను మరింత సులభం చేయడంతోపాటు మనీలాండరింగ్ ను అరిట్టేందుకు సహాయపడుతుందని తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల సెటిల్మెంట్ కోసం ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తారు. కాగా ఈ ప్రాజెక్టులో 9 బ్యాంకులు పాలుపంచుకోనున్నాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్ సీ బ్యాంక్, హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లు ఉన్నాయి.

ఆర్బిఐ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టిన తర్వాత…మీ దగ్గర నగదు ఉంచుకోవల్సిన అవసరం ఉండదు. మరీ మీ మొబైల్ వాలెట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ డిజిటల్ కరెన్సీ చలామణిపై రిజర్వ్ బ్యాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. ఈ డిజిటల్ కరెన్సీ ప్రవేశంతో సామాన్యులకు, ప్రభుత్వంతోపాటు వ్యాపార లావాదేవీలకు అయ్యే ఖర్చు దాదాపుగా తగ్గుతుంది.