Pink Diamond: ఈ పింక్ వజ్రం ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 900 కోట్ల రూపాయలకుపైనే?

మామూలుగా వజ్రాల ఖరీదుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి.

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 08:00 AM IST

మామూలుగా వజ్రాల ఖరీదుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి అంత డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఇక తాజాగా ఒక పింక్ వజ్రం బయటపడటంతో దాని ధర ఏకంగా 900 కోట్లపైనే ఉంటుందని తెలుస్తుంది. ఇంతకూ అది ఎక్కడ దొరికిందంటే.. ఆఫ్రికా ఖండంలోని అంగోలాలో వజ్రాల కోసం ఆస్ట్రేలియా సంస్థ లుపాక డైమండ్ కంపెనీ తవ్వకాలు జరుపుతుండగా ఈ పింక్ డైమండ్ బయటపడింది.

ఇది లేత గులాబీ రంగులో 170 క్యారెట్ల బరువుతో ఉందని తెలిసింది. ప్రపంచంలోనే గత 300 ఏళ్లలో అతిపెద్ద డైమండ్ ఇదేనని గుర్తించారు. ఇక ఇది అరుదైన కేటగిరీలో వస్తుందని ఆ కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ వజ్రానికి లులో రోజ్ అని పేరు కూడా పెట్టారు. ఇక దీనిని మూడు రూపంలో సాన బెడితే దాదాపు 85 నుంచి 90 క్యారెట్ల వరకు పాలిష్డ్ వజ్రంతో పాటు చిన్న చిన్న వజ్రాలు రూపొందుతాయని తెలిపారు.

2017 లో కూడా ఇటువంటి పింక్ స్టార్ వజ్రాన్ని హాంకాంగ్ లో వేలం వేశారని అది మన కరెన్సీ ప్రకారం అయితే రూ.570 కోట్లు పలికిందని తెలిపారు. ఇక ఈ లులో రోజ్ దాదాపు 90 క్యారెట్ల వరకు ఉండనుండటంతో ఆ పింక్ స్టార్ కంటే భారీ ధర పలకవచ్చని.. అంచనా ప్రకారం రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఉంటుందని ఆ సంస్థ భావిస్తుంది.