Dog Temple : ఆలయంలో శునకానికి విగ్రహం.. ఎక్కడ ? ఎందుకు ?

Dog Temple : అక్కడి ఓ గుడిలో కుక్క విగ్రహాన్ని పూజిస్తున్నారు. కుక్క విగ్రహానికి పూజలు ఈరోజో.. రేపో.. మొదలుకాలేదు.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 02:28 PM IST

Dog Temple : అక్కడి ఓ గుడిలో కుక్క విగ్రహాన్ని పూజిస్తున్నారు. కుక్క విగ్రహానికి పూజలు ఈరోజో.. రేపో.. మొదలుకాలేదు. దాదాపు వందేళ్ల కిందటి నుంచే కుక్క విగ్రహాన్ని ఆ ప్రాంత ప్రజలు పూజిస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ? ఉత్తరప్రదేశ్​లోని బులంద్​ షహర్​లో ఉన్న సికందరాబాద్‌లో ఈ అరుదైన ఆలయం ఉంది. ఈ గుడిలో శునకం విగ్రహానికి పూజలు చేయడానికి ఒక బలమైన కారణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు 100 ఏళ్ల కిందట సికందరాబాద్‌లో బాబా లటూరియా ఉండేవారట. ఆయన సొంతంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఉంటూ.. ఇక కుక్కను బాబా లటూరియా పెంచుకునేవారు. ఆ కుక్కను..  ‘బైరో బాబా’గా పిలిచేవారు. ఓ రోజు బాబా లటూరియా తాను నిర్మించిన గుడిలోనే సజీవ సమాధి అయ్యేందుకు రెడీ అయ్యారట. ఈ సమయంలో బైరో బాబా(శునకం) కూడా సజీవ సమాధిలోకి దూకిందని చెబుతారు.

Also Read: Bhindranwales Nephew : ఉగ్రవాది భింద్రన్‌వాలే మేనల్లుడి మృతి.. ఎలా అంటే ?

అయితే ప్రజలు వెంటనే అలర్ట్ అయిపోయి.. శునకాన్ని బయటకు తీశారట. అయినప్పటికీ సమాధి నుంచి బయటకు తీసిన కాసేపటికే శునకం కూడా ప్రాణాలు విడిచిందట. ఆ తర్వాతే ఆలయంలో శునకానికి విగ్రహాన్ని నిర్మించారట. ప్రేమ, విధేయతలతో బాబా లటూరియా వెంట జీవితాంతం తిరిగిన శునకాన్ని నాటి నుంచే పూజించడం మొదలుపెట్టారు. ఈ కుక్క విగ్రహం పాదాలకు నల్ల దారం కట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని స్థానిక భక్తులు నమ్ముతారు. ఇటువంటి విశిష్టత కారణంగా ఈ ఆలయానికి ‘బైరో దేవాలయం’(Dog Temple) అనే పేరొచ్చింది.