Site icon HashtagU Telugu

Zelenskyy New Sea Animal: శిలాజ జీవికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడి పేరు.. ఎందుకో తెలుసా?

Ukraine President

Ukraine President

తాజాగా పోలాండ్‌లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్‌ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు అయిన జెలెన్‌ స్కీ పేరు పెట్టారు. అయితే ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. అయితే దీనిని ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ జీవి సుమారుగా 10 పొడవాటి చేతులు, అలాగే పదునైన టెన్టకిల్‌ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు తెలిపారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్ స్కీ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నాడు.

అయితే మాతృభూమి రక్షణ కై ఉక్రెయిన్‌ జెలన్‌స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించడం జరిగింది. అంతేకాకుండా ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్‌ స్కీ గా కూడా నామకరణం చేశారు. ఇలాంటి వి౦తజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి కాగా ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి.

కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్‌ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతువుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు. కానీ ఇతర జీవులకు మాత్రం విషపూరితమైనవె అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.