PM MODI GIFT: యువతకు ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్…7,5000కొత్త నియామకాలతో ‘ఉపాధి మేళా’..!!

దీపావళి సందర్భంగా దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహుమతి అందించనున్నారు.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 08:47 AM IST

దీపావళి సందర్భంగా దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహుమతి అందించనున్నారు. అక్టోబర్ 22 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10లక్షల మంది సిబ్బందికి రిక్రూట్ మెంట్ డ్రైవర్ రోజ్ గార్ మేళాను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో కొత్తగా నియమితులైన 75,000మంది సిబ్బందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని పలు నగరాలకు చెందిన కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

డిసెంబర్ 2023నాటికి 10లక్షల ఉద్యోగాలు:
ఒరిస్సా నుంచి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ నుంచి మన్సుఖ్ మాండవియా, ఛండీగడ్ నుంచి అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. దీంతో ఇతర మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఎంపీలందరూ తమ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 2023 నాటికి 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ ఏడాది జూన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

యువతకు ఉపాధి అవకాశాలు:
యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు సంక్షేమానికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ముందడగు వేస్తున్నారు. ప్రధాని ఆదేశాల మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు, ఇప్పటికే మంజురైన పోస్టుల ఖాళీలను మిషన్ మోడల్ లో భాగంగా వాటిని భర్తీ చేసే దిశగా కృషి చేస్తున్నాయి.

38 మంత్రిత్వ శాఖల్లో నియామకాలు:
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొత్త సిబ్బందిని భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖల్లో నియమించనున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన సిబ్బంది గ్రూప్ ఎ, బీ, గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి వంటి పలు స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరుతారు. సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ పర్సనల్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్ డిసి, స్టెన్, పిఎ, ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, ఎంటిఎస్ వంటి పోస్టుల్లో రిక్రూట్ మెంట్ జరుగుతోంది.