PM Kisan: మీ అకౌంట్లో పీఎం కిసాన్ 12 విడత డబ్బులు పడలేదా ? ఆందోళన పడకండి..! సమస్య ఏంటో ఇలా తెలుసుకోండి.!!

ఈనెల 17వ తేదీన (అక్టోబర్ 17) 8కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 12వ విడత నిధులు జమ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 09:27 AM IST

ఈనెల 17వ తేదీన (అక్టోబర్ 17) 8కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 12వ విడత నిధులు జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని డీబీటీ బదిలీ ద్వారా రైతుల అకౌంట్లోకి విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సెప్టెంబర్ 12నుంచి నుంచి నిధుల విడుదల కోసం రైతుల ఎదురు చూశారు. భూ రికార్డుల పరిశీలన కారణంగా ఈ 12 విడత నిధుల విడుదలలో జాప్యం జరిగింది. అయితే దీపావళికి ముందే కేంద్రం ప్రభుత్వం రైతులకు ఈ గుడ్ న్యూస్ అందిస్తూ వారి ఖాతాల్లో నగదు జమ చేసింది.

అర్హులైన రైతులందరికీ ఈ నిధులు అందించడంతో…వారు సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొందరు రైతుల అకౌంట్లో ఈ 12వ విడత నిధులు జమ కాలేదు. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ స్టాల్ మెంట్ అందకపోతే…ఎందుకు జమ కాలేదో తెలుసుకోవాలంటే pmkisan-ict@gov.inవెబ్ సైజ్ ను సంప్రదించండి. అంతేకాదు పిఎం కిసాన యోజన – 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. మీరు ఈ పథకానికి అర్హులైతే కచ్చితంగా మీకు 12 విడద వాయిదా మొత్తం మీ అకౌంట్లో జమ అవుతుంది.

జాబితాను ఇలా చెక్ చేసుకోండి!
-pmkisan.gov.in వద్ద PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.
-హోం పేజీలో కుడివైపును ఫార్మర్స్ కార్నర్ ఉంటుది. దానిపై క్లిక్ చేయండి.
-ఫార్మర్స్ కార్నర్ విభాగంలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
-పీఎం కిసాన్ అకౌంట్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎదైనా ఒకటి సెలక్ట్ చేసుకోండి.
-వివరాలను నమోదు చేసిన తర్వాత గేట్ డేటాపై క్లిక్ చేయండి.
-ఇప్పుడు మీరు స్క్రీన్ పై పూర్తి వివరాలు చూస్తారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచిరైతులకు ఎలా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో రూ. 2వేల చొప్పు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈనెల 17 వ తేదీని 12 విడత నిధులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి.