ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 12:16 PM IST

సాధారణంగా మనం విమానం ల్యాండింగ్ అయ్యేది సినిమాలలో లేదంటే రియల్ లైఫ్ లో చూసి ఉంటాం. అయితే విమానాలు చాలా దూరం నుంచి లాండింగ్ అయ్యి నిదానంగా వస్తూ చివరికి ఎయిర్ పోర్ట్ కి వచ్చి ఆగుతాయి. అయితే విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ విమానం ల్యాండింగ్ చూస్తే మాత్రం షాక్ అవాల్సిందే పూర్తి వివరాల్లోకి వెళితే…గ్రీస్‌లోని స్కియాథోస్‌ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది అని చెప్పవచ్చు.

ఇక్కడ విమానాలు ల్యాండింగ్ చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తు ఉంటారు. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లాగా అంత పెద్దగా కాకుండా చిన్న రన్‌వే ఉంటుంది. అయితే ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్‌ 757. అయితే ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్‌ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఫోన్లో రికార్డ్ చేసి చూసిన వీడియోలు షేర్ చేశారు.

ఆ వీడియోలు కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. విమానం అంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ అవ్వడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. విజ్‌ ఎయిర్‌ ఎయిర్‌బస్‌ ఏ321నియో విమానం సముద్ర నీటిని తాకుతుందా అన్న విధంగా అలెగ్జాండ్రోస్‌ పపడియామంటిస్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ల్యాండింగ్‌ కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్‌వే ఫెన్సింగ్‌ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే స్కియథోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్‌వే మాత్రమే కలిగి ఉంటుంది. 1972లో ప్రారంభం అయిన ఈ ఎయిర్ పోర్ట్ అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత.