4000 Pens Library : ఇతడే ‘పెన్ మ్యాన్‌’.. ఎన్ని పెన్నులు ఉన్నాయో తెలుసా ?

4000 Pens Library : మనం ఈరోజు ‘పెన్ మ్యాన్‌’ను కలవబోతున్నాం. ఈయన ఇప్పటివరకు ఎన్ని పెన్నులను కలెక్ట్ చేశారో తెలుసా ?

Published By: HashtagU Telugu Desk
4000 Pens Library

4000 Pens Library

4000 Pens Library : మనం ఈరోజు ‘పెన్ మ్యాన్‌’ను కలవబోతున్నాం. ఈయన ఇప్పటివరకు ఎన్ని పెన్నులను కలెక్ట్ చేశారో తెలుసా ? ఒడిశాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల తుషార్ కాంతదాస్  ఇప్పటివరకు  దాదాపు 4వేలకుపైగా పెన్నులను సేకరించారు.  ఆయనను అందరూ ‘పెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’ అని పిలుస్తున్నారు. ఈయన తన ఇంట్లో సెటప్ చేసిన పెన్ లైబ్రరీలో 5  రూపాయల రేనాల్డ్స్ పెన్ను నుంచి రూ.5వేల వాటర్‌మ్యాన్ బ్రాండ్ పెన్ను దాకా ఉన్నాయి.  గత 30 ఏళ్లుగా తాను పెన్నులను కలెక్ట్ చేస్తున్నానని తుషార్ అంటున్నారు. ‘‘పెన్నుల సేకరణపై నాకు అభిరుచి పెరగడానికి కారణం.. పార్కర్ పెన్‌. పదోతరగతిలో ఉన్న టైంలో నేను ఆ పెన్ను స్టైల్‌కు ఫిదా అయ్యాను. ఆనాటి నుంచి అందమైన, సొగసైన పెన్నుల సేకరణను మొదలుపెట్టుకున్నాను. ఆ విధంగా క్రమక్రమంగా నా పెన్నుల లైబ్రరీ పెరుగుతూపోయింది’’ అని తుషార్ తన హామీ గురించి వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘పదో తరగతి చదువుతున్నప్పుడే నేను నా స్నేహితుల దగ్గరి నుంచి పెన్నులు సేకరించడం మొదలుపెట్టాను. 1992 నుంచి 2005 వరకు బాగా పాపులర్ అయిన రేనాల్డ్స్ బాల్ పెన్నులతో నేను రాసేవాడిని. ఆ తర్వాత రకరకాల పెన్నులతో రాయడం మొదలుపెట్టి కలం ప్రేమికుడిగా మారాను. నా బంధువులు, స్నేహితులలో ఎవరైనా విదేశాలకు వెళ్లినా.. నా లైబ్రరీ కోసం వెరైటీ పెన్నులను తీసుకురమ్మని వాళ్లకు చెబుతుంటాను’’ అని తుషార్ కాంతదాస్ తెలిపారు. 1992లో తాను రేనాల్డ్స్ పెన్‌తో రాసేవాడినని, ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన వద్ద రూ. 5000పైచిలుకు రేటును కలిగిన పెన్నులు కూడా ఉన్నాయని చెప్పారు. బంగారు పూత పూసిన పెన్నులు, వజ్రాలు పొదిగిన పెన్ను, జర్మనీ, అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పెన్నులు కూడా తన పెన్ లైబ్రరీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో తన పెన్ లైబ్రరీలోని పెన్నుల సంఖ్యను 10వేలకు పెంచడమే లక్ష్యమని తుషార్ (4000 Pens Library) అంటున్నారు.

Also Read: Shani Deepam : దీపావళి రోజు ‘శనిదీపం’ ప్రాముఖ్యత ఏమిటి ?

  Last Updated: 04 Nov 2023, 10:33 AM IST