Site icon HashtagU Telugu

Fight in Flight: ఫ్లైట్ లో ఫైట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

fight in flight

Viral

మీరు విమానంలో (Flight) ప్రయాణిస్తున్నారా.. అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎర్రబస్సులో ప్రయాణికులు కొట్టుకున్న మాదిరిగా విమానంలో ప్రయాణికులు కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ (Viral) అవుతోంది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో (Flight) ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. మొదట చిన్నపాటి గొడవ మొదలైంది. ఆ తర్వాత కొట్టుకునేస్థాయికి చేరుకుంది. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేశారు. ఇద్దర్నీ విమాన సిబ్బంది వారించే ప్రయత్నం చేశారు.

వారిలో ఒకరు ‘‘శాంతి సే బాత్’’(నిశ్శబ్ధంగా కూర్చొండి) అని అంటే మరొకరు ‘‘హాత్ నీచే కర్’’(మీ చేయి కిందకు దించు) అంటూ వాదించుకున్నారు. ఆ తరువాత కొన్ని సెకన్ల వ్యవధిలోనే పరస్పరం దాడికి దిగారు. ఆ తర్వాత ఒకే వ్యక్తిపై ఐదుగురు ప్రయాణికులు కలిసికట్టుగా దాడి చేశారు. ప్లీజ్ ఆపండి అని సిబ్బంది అరుస్తున్నా పట్టించుకోకుండా చావబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. వార్ని అది ఎర్రబస్సా.. విమానమా (Flight).. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్.. మరో వివాదంలో రష్మిక