Site icon HashtagU Telugu

Canada Bhagwat Gita Park: కెనడాలో పార్కుకు ‘శ్రీ భ‌గ‌వ‌ద్గీత’ పేరు..!

Bhagwatgitapark Imresizer

Bhagwatgitapark Imresizer

కెనాడాలోని ఓ పార్కుకు భగవద్గీత పేరును పెట్టారు. బ్రాంప్టన్‌లోని ట్రాయ‌ర్స్ పార్క్ పేరును ‘శ్రీ భ‌గ‌వ‌ద్గీత’ పార్క్‌గా మార్చ‌డంతో పాటు పార్కులో ర‌థంపై శ్రీకృష్ణుడు, అర్జునుడి శిల్పాలు, మ‌రికొన్ని హిందూ దేవ‌త‌ల శిల్పాలు ఉంటాయ‌ని బ్రాంప్ట‌న్ సిటీ మేయ‌ర్ తెలిపారు. ఇలా చేయ‌డంతో హిందూ స‌మాజాన్ని గౌర‌వించ‌డంతో పాటు ఆ బ్రాంప్ట‌న్ న‌గ‌ర ప్ర‌యోజ‌నానికి ఉప‌యోగ‌ప‌డ్డ‌వారిని గుర్తుచేసుకుంటున్నామ‌ని వివ‌రించారు.

కెనడాలోని బ్రాంప్టన్ సిటీ మున్సిప‌ల్‌ కార్పొరేషన్ నగరంలోని 6వ వార్డులో ఒక పార్కుకు “శ్రీ భగవద్గీతా పార్క్” అని పేరు పెట్టింది. ఈ పార్క్ 3.75 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్ ఎంతో అందంగా, సుందరంగా ఉంటుంది. హిందూ దేవతలతో పాటు గీతలోని రెండు ప్రధాన పాత్రలు, రథంపై శ్రీకృష్ణుడు, అర్జునుడి శిల్పాలు ఉన్నాయ‌ని తెలిపారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ.. నేను గీతా బోధనలను విశ్వసిస్తాను.. గౌరవిస్తాను. భారతదేశం బ‌య‌ట‌ పవిత్ర గ్రంథమైన శ్రీ భగవద్గీత పేరు పెట్టబడిన ఏకైక పార్కు ఇదేనని ఆయన అన్నారు.

కెనడాలోని సిక్కుల తర్వాత హిందువులు రెండో స్థానంలో ఉన్నారు. అక్కడ ఎక్కువగా గుజరాతీలు ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. పవిత్ర భగవద్గీతలో బోధించిన సందేశాన్ని మరింత వ్యాప్తి చేయడంలో ఈ పార్క్ ప్రతీకగా మారుతుందని ఆయన అన్నారు.