Site icon HashtagU Telugu

Dance and Death: పెళ్లింట విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి, వీడియో వైరల్!

Pic

Pic

పెళ్లి వేడుకల్లో ఆనందకర విషయాలే కాదు.. విషాద ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి బరాత్ లో డాన్సులు చేస్తూ కుప్పకూలిపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా అలాంటి ఘటననే ఒకటి జరిగింది. వారణాసిలోని పిప్లానీ కత్రా ప్రాంతానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో ఒక వ్యక్తి నృత్యం చేస్తూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యక్తి బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, ఒక్కసారిగా  నేలపై పడిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మనోజ్ విశ్వకర్మ (40) నవంబర్ 25 న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు పిప్లానీ కత్రా కు వెళ్లాడు. బంధుమిత్రులతో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అతను డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో డాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. అయితే ఇలాంటి ఘటన జరగడం మొదటిసారి కాదు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో తన కోడలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.