Site icon HashtagU Telugu

OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

Ola Maps

Ola Maps

తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. వీకెండ్‌లో సరదాగా భార్యా,పిల్లలను సినిమాకి వెంటబెట్టుకెళ్లిన ఓ వ్యక్తి ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో చనిపోయాడు. ఓటీపీ విషయంలో తలెత్తిన ఘర్షణే ఈ మరణానికి దారితీసింది. వివరాలు ఇవి..

ఓటీపీ అడగగానే ..

కోయంబత్తూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉమేంద్ర వీకెండ్ లో భార్యాబిడ్డలతో సరదాగా గడపాలనుకున్నాడు. చెన్నైలోని బంధువుల ఇంటికి ఫ్యామిలీతో వెళ్లాడు. అక్కడ సంతోషంగా గడిపాక ఆదివారం ఇంటికి తిరుగుపయనంలో.. భార్యపిల్లలను సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూశాక ఉమేంద్ర భార్య క్యాబ్ బుక్ చేసింది. కారు వచ్చింది. ఎక్కారు. క్యాబ్ డ్రైవర్ రవి ఓటీపీ అడగగానే భార్యభర్తలు తికమకపడ్డారు. దీంతో డ్రైవర్ విసిగాడు. ఓటీపీ సరిగా చెప్పండి.. లేదంటే క్యాబ్ దిగిపోండని వారించాడు. దీంతో ఉమేంద్ర కుటుంబం కోపంగా కారు దిగింది.ఈ క్రమంలో కారు తలుపును ఉమేంద్ర గట్టిగా మూశాడు. దీంతో క్యాబ్ డ్రైవర్, ఉమేంద్ర మధ్య వాగ్వాదం జరిగింది. ఉమేంద్రపై డ్రైవర్ తన సెల్‌ఫోన్‌ విసిరాడు. ఆ తర్వాత కారు దిగొచ్చి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అనూహ్య దాడితో ఉమేంద్ర కూలబడ్డాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. నిందిత డ్రైవర్‌పై మర్డర్ కేసు నమోదు చేశారు.

Exit mobile version