Site icon HashtagU Telugu

SBI Recruitment : శుభవార్త..709 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్… దరఖాస్తుకు చివరి తేదీ రెండు రోజులే..!!

Sbi

Sbi

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్, ఐటీ, డేటాబేస్, డేటా సైన్స్ మొదలైన విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ మొత్తం 665 పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు రిక్రూట్‌మెంట్ ప్రకటనలను రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈ మూడు పోస్ట్‌ల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, sbi.co.inలో అందించబడిన లింక్‌ను చూడండి. లేదంటే కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి అప్లికేషన్ పేజీని చూడిండి. దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 సెప్టెంబర్ 2022.

వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్‌లో 665 పోస్టుల రిక్రూట్‌మెంట్:
రిక్రూట్‌మెంట్ వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ కోసం, ఇందులో రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మొదలైన పోస్టుల కోసం మొత్తం 665 ఖాళీలను కాంట్రాక్ట్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు వార్షిక వేతనం రూ.2.5 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుంది. పోస్ట్ వారీగా ఖాళీల సంఖ్య, అవసరమైన అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాల కోసం రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ను చూడండి. ఈ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి.

ITలో 25 పోస్టుల రిక్రూట్‌మెంట్:
ఇక ఐటీ విభాగానికి సంబంధించి 25 పోస్టులను SBI భర్తీ చేసింది. వీటిలో డాట్ నెట్ డెవలపర్, జావా డెవలపర్, ఏఐ/ఎంఎల్ డెవలపర్, విండోస్ అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ మేనేజర్ పోస్టులపై రిక్రూట్‌మెంట్ చేయనుంది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అర్హత, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం ఈ లింక్ ను ఒపెన్ చేయండి.

డేటా సైన్స్, డేటాబేస్‌లో 19 పోస్టుల రిక్రూట్‌మెంట్:
ఐటీ రంగానికి సంబంధించిన మరో రిక్రూట్‌మెంట్, SBI మొత్తం 19 పోస్టులను విడుదలచేసింది. ఇందులో మేనేజర్ (డేటా సైంటిస్ట్ – స్పెషలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్ – స్పెషలిస్ట్) సిస్టమ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రెగ్యులర్‌ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌ జరగుతుంది. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నుండి దరఖాస్తు కోసం అర్హత, ఎంపిక ప్రక్రియ గురించి ఈ లింక్ ను ఒపెన్ చేయండి. .