DRDOరీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ CEPTAM 10 అడ్మిన్ అండ్ అలైడ్ రిక్రూట్ మెంట్ 2022, 1061 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. డీఆర్ఎడీవో జూనియర్ ట్రాన్స్ లేర్, స్టెన్ గ్రాఫర్ గ్రేడ్ 1, స్టేన్ గ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తోపాటు పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిచింది.
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు నవంబర్ 7 నుంచి ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 7 చివరి తేదీ. ఈ పోస్టుల కోసం విద్యార్హత గురించి తెలుసుకోవాలంటే అధికారిక నోటిఫికేషన్ ను చూడవచ్చు. ఈ పోస్టులన్నింటిని దరఖాస్తు చేసుకోవాలటే 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 27ఏళ్ల వయస్సు ఉండాలి. ఇది కాకుండా జూనియర్ ట్రాన్స్ లేటర్, స్టెనో గ్రఫార్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.