Balcony Rent : నెలవారీ ఇంటి అద్దె వేల రూపాయల్లో ఉండటం నేటి రోజుల్లో కామనే. కానీ ఒక నగరంలో బాల్కనీ అద్దె కూడా వేల రూపాయల్లో ఉంది. బాల్కనీ అద్దె(Balcony Rent) ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. రూ.81,003 నెలవారీ అద్దెకు తన బాల్కనీని రెంటుకు ఇస్తానంటూ ఓ మహానుభావుడు ప్రకటన జారీ చేశాడు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
అది ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney) నగరం. ఆ నగరంలోని ఓ ఇంటిపై ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ ఇంటి బాల్కనీ అద్దె ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉంది. బాత్ రూం, బెడ్ రూం లేకుండా బాల్కనీలో ఎలా ఉండాలి ? అంతమాత్రం దానికి ఇంత రెంటు కట్టాలా ? అనే ప్రశ్న చాలామంది మదిలో ఉదయిస్తోంది. అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు.. ఎందుకంటే బాత్ రూం కోసం ఇంటి ఓనర్ ఏర్పాట్లు చేశాడు. బాల్కనీలోనే బెడ్ వేసుకొని ఎంచక్కా పడుకోవచ్చు. ఇంత రెంటు పలుకుతున్న ఈ బాల్కనీతో కూడిన ఇల్లు.. సిడ్నీ నగరం నడిబొడ్డునేం లేదు. ఎక్కడో నగరం శివార్లలో విసిరిపారేసినట్టు ఉండే ఏరియాలో ఉంది.
Also Read :IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్
ఆ ఇంటి ఓనర్ బాల్కనీ ఫొటోతో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ముద్దుగా ఆ బాల్కనీని సన్నీ రూం అని పిలుస్తున్నారు. ఆ సన్నీ రూంలో మంచం, అద్దం, బ్లైండ్స్, ఫ్లోరింగ్ మీద కార్పెట్ ఉన్నాయి. బాల్కనీని, మిగిలిన ఇంటిని కలుపుతూ గ్లాస్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. ఆ తలుపులు తీసుకుని మనం ఇంట్లోకి ఎంటర్ కావచ్చు . ఈ బాల్కనీ అద్దెకు సంబంధించి ఓనర్ మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. వారానికి వారం కూడా రెంటును కట్టుకోవచ్చని అతడు కోరుతున్నాడు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లును అద్దెకు ఉండే వ్యక్తే పే చేయాలని ఓనర్ తేల్చి చెబుతున్నాడు. ఈ షరతులకు ఒప్పుకుంటేనే తన ఇంటి బాల్కనీలో అద్దెకు దిగాలని కోరుతున్నాడు. ఇలా భారీగా అద్దెలు పెరుగుతున్న నగరాల జాబితాలో మన దేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు కూడా ఉన్నాయి.