Australia Pink Sky : ఆస్ట్రేలియా ఆకాశం హైజాక్.. ఏలియన్స్ “గులాబీ” వార్నింగ్!!

ఆకాశం అనగానే గుర్తుకొచ్చే రంగు .. "నీలం"!! కానీ ఆకాశం కొద్ది సమయం కోసం గులాబీ కలర్ లోకి మారిపోతే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 10:30 AM IST

ఆకాశం అనగానే గుర్తుకొచ్చే రంగు .. “నీలం”!! కానీ ఆకాశం కొద్ది సమయం కోసం గులాబీ కలర్ లోకి మారిపోతే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకలా జరిగింది ? అనే ప్రశ్న.. ఎంత అందమైన సీన్ ఇది !! అనే సంభ్రమాశర్యం రెండూ ఏకకాలంలో మన మెదడులో చక్కర్లు కొడుతాయి. సరిగ్గా ఇటువంటి ఫీలింగ్సే ఆస్ట్రేలియాలోని మిల్ డ్యూరా పట్టణ ప్రజలకు ఎదురయ్యాయి.సాయంత్రం వేళ ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అని వర్ణించారు. ఇంకొందరు గ్రహాంతర వాసుల పనేనని చెప్పారు. ఏలియన్స్ ఆకాశాన్ని హైజాక్ చేసి.. రంగు మార్చి.. మనుషులకు ఏదో వార్నింగ్ ఇస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఆకాశంలో
గులాబీ రంగు కనిపించిన ప్రాంతానికి .. భూమి నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న ఏదో మాధ్యమం వల్లే ఆకాశంలో గులాబీ రంగు వచ్చిందనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు.

గులాబీ రంగు ఎలా వచ్చింది?

ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాస్యూటికల్ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని శాస్త్రవేత్తలు తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది ఆ ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్‌  ఉపయోగించాలని ఫార్మా సంస్థ సీఈవో పీటర్‌ క్రాక్ తెలిపారు. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.