Danger Apps : 8 యాప్స్ లో డేంజర్ మాల్ వేర్.. బ్యాంక్ అకౌంట్లోకి చొరబాటు!!

మీకు తెలియకుండానే మీరు ఒక పనికి రాని ఆన్లైన్ సర్వీస్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటారు..

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 08:00 AM IST

మీకు తెలియకుండానే మీరు ఒక పనికి రాని ఆన్లైన్ సర్వీస్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటారు..మీ అకౌంట్/ క్రెడిట్ కార్డు /డెబిట్ కార్డు నుంచి డబ్బులు కట్ అయిపోతాయి.ఆ మెసేజ్ ను చూసి షాక్ కు గురవడం తప్ప చేసేదేం ఉండదు.ఇదంతా జరగకూడదంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న 8 ప్రమాదకర యాప్స్ ను ఫోన్ నుంచి తీసేయాలి. లేదంటే.. ఆ 8 యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోకుండా ముందు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. ఆ యాప్స్ లో ప్రమాదకరమైన మాల్ వేర్ ఉంది.

8 డేంజరస్ యాప్స్ ఇవే…

Vlog Star Video Editor, Creative 3D Launcher, Wow Beauty Camera, Gif Emoji Keyboard, Freeglow Camera, Coco Camera v1.1, Funny Camera by KellyTech, and Razer Keyboard & Theme by rxcheldiolola

ఈ యాప్స్ లో ఏముంది ?

ఈ డేంజరస్ 8 యాప్స్ లో ” ఆటో లైకోస్ ” (Autolycos) అనే ఒక మాల్ వేర్ దాగి ఉంది. ఇది మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ , క్రెడిట్/డెబిట్ కార్డును యాక్సెస్ చేస్తుంది. మీ అకౌంట్లోని డబ్బులు ఖర్చు చేసి.. మీ కోసం అనవసరమైన సర్వీసులను సబ్ స్క్రైబ్ చేయిస్తుంది. మొబైల్ ఓనర్ పర్మిషన్ లేకుండా .. బ్యాంకు ఖాతాలలోకి చొరబడి సమాచారాన్ని దొంగిలించే పనిని ” ఆటో లైకోస్ ” చేస్తుంది. ఈ తరహా ప్రమాదకరమైన యాప్ లను గుర్తించే విషయంలో గూగుల్ స్లో గా స్పందిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాద కరమైన యాప్ లను ఫ్రాన్స్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ అధ్యయన సంస్థ Maxime Ingrao గుర్తించి గూగుల్ కు తెలియజేసింది. దీంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇక్కడి దాకా బాగానే ఉన్నా.. ఇప్పటికే ఈ 8 యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న వాళ్ళు వాటిని అన్ ఇన్ స్టాల్ చేసుకుంటే మంచిది.