Job Offer For 10th Class Student: పదో తరగతి కుర్రాడికి రూ.33 లక్షల జాబ్ ఆఫర్!!

తొలి ప్రయత్నంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్‌ కు రూ.33 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Laptop Side Effects

Laptop Side Effects

తొలి ప్రయత్నంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్‌ కు రూ.33 లక్షల ప్యాకేజీతో జాబ్ వచ్చింది. కానీ ఇచ్చిన జాబ్ ఆఫర్ ను కంపెనీ వెంటనే వెనక్కి తీసుకుంది. కారణం ఏమిటి .. అనుకుంటున్నారా? అతడి వయసు!! ఔను.. తాము జాబ్ ఆఫర్ చేసిన కుర్రాడి వయసు 15 ఏళ్లేనని తెలియడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. ఇంత పెద్ద ప్యాకేజీతో.. ఒక అమెరికా కంపెనీ జాబ్ ఆఫర్ చేసేంతగా వేదాంత్‌ ఏం చేసి ఉంటాడు అనుకుంటున్నారా?

వేదాంత్‌ ఎలా ఎంపికయ్యాడు ?

వేదాంత్ తల్లిదండ్రులు అశ్విని, రాజేశ్ ఇద్దరూ నాగ్‌పూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. వేదాంత్‌ తన తల్లి ల్యాప్‌ టాప్ లో ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తుండగా..అమెరికాలోని న్యూజెర్సీ యాడ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కోడింగ్‌ కాంపిటీషన్‌ గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానికి దరఖాస్తు చేశాడు. ఆన్‌లైన్‌ కోడింగ్‌ కాంపిటీషన్‌ కోసం కేవలం రెండు రోజుల్లోనే 2,066 లైన్ల ప్రోగ్రామింగ్‌ కోడ్‌ రాశాడు. హెచ్‌టీఎంఎల్‌, జావాస్ర్కిప్ట్‌, వర్చువల్‌ స్టూడియో కోడ్‌(2022)తో కాంపిటీషన్‌లో ప్రోగ్రామింగ్ చేశాడు.దీంతో ఆ అమెరికా కంపెనీలో రూ.33 లక్షల ప్యాకేజీతో వేదాంత్‌ కు జాబ్ వచ్చింది. అయితే, జాబ్‌ ఆఫర్‌ చేసినప్పుడు సంస్థకు వేదాంత్‌ వయస్సు తెలియదు. తర్వాత తెలుసుకొని జాబ్‌ నిరాకరించింది. అయితే పదో క్లాస్ విద్యార్థి అయిన వేదాంత్ నిరుత్సాహపడకుండా ఆ కంపెనీ అతడికి ఓ ఆఫర్ ఇచ్చింది. చదువు పూర్తి చేసుకున్నాక.. తమను సంప్రదించాలని సూచించింది. ‘నీ ఎక్స్‌పీరియన్స్, ప్రొఫెషనలిజం, తీరుతో’తో ఇంప్రెస్ అయ్యామంటూ ఆ సంస్థ వేదాంత్‌కు లేఖ రాసింది.

సొంతంగానే..

వేదాంత్ సొంతంగానే కోడింగ్ నేర్చుకోవడం విశేషం. తన తల్లి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి అతడు కోడింగ్ నేర్చుకున్నాడు. ఆ ల్యాప్‌టాప్ ద్వారా దాదాపు 25 ఆన్‌లైన్ ట్యూటోరియల్స్ చూసిన వేదాంత్.. అవన్నీ స్లోగా ఉన్నాయని.. అవుట్‌డేట్ అయిపోయాయని చెప్పడం గమనార్హం. ‘మా అబ్బాయి కోడింగ్ కాంపీటిషన్‌ల విజేతగా ఎలా నిలిచాడనేది మాకు తెలీదు. వేదాంత్ చదువుకునే స్కూల్ వాళ్లు ఫోన్ చేసి ఈ ఆఫర్ గురించి చెప్పారు’ అని రాజేశ్ తెలిపారు. .

  Last Updated: 26 Jul 2022, 12:40 PM IST