ఉత్తరప్రదేశ్ లోని బిలిభిత్ జిల్లా శివార్లలో అంతుచిక్కని జ్వరంగా 8మందిని బలిగొంది. ఈ జ్వరానికి సంబంధించిన కారణాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. నౌగ్వాన్ పకార్య పట్టణంలో 15ఏళ్ల బాలుడు దేవాన్ష్ మిశ్రా తీవ్రమైక కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే బాలుడికి వచ్చిన జ్వరం మిస్టరీగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మరో నలుగురు అదే వింత జ్వరంతో మరణించారు. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తుల రక్త నమూనాలను సేకరించింది ఆరోగ్య శాఖ. డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించింది. కానీ పరీక్షల్లో అలాంటి లక్షణాలేవి లేనట్లు గుర్తించారు. కాగా పట్టణంలో తాగునీరు కలుషితం కావడమే దీనికి ప్రధాన కారణం కావచ్చని సీఎంఓ తెలిపింది.
Mystery : యూపీలోని పిలిభిత్ లో వింత జ్వరం…రెండు వారాల్లో 8మంది మృతి..!!

Fever