Muhammad Ali Old Video: దటీజ్ మహమ్మద్ అలీ.. 10 సెకన్లలో 21 పంచులు, బాక్సింగ్ కింగ్ టైమింగ్ కు నెటిజన్స్ ఫిదా!

బాక్సింగ్ అనగానే లెజెండ్ బాక్సర్ (Muhammad Ali) చాలామందికి గుర్తుకువస్తాడు.

  • Written By:
  • Updated On - January 9, 2023 / 03:23 PM IST

బాక్సింగ్ (Boxing) అంటే అంత ఈజీ కాదు. రింగ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండాలి. ప్రత్యర్థిపై పంచులకొద్దీ పంచులు విసిరి ఉక్కిరిబిక్కిరి చేయాలి. అప్పుడే రింగ్ లో కింగ్ అవుతాడు. ప్రపంచ బ్యాక్సింగ్ లో ఎంతోమంది కింగ్స్ పుట్టుకొచ్చిన మహమ్మద్ అలీ (Muhammad Ali) ని మించిన కింగ్  ఎవరూ లేరని చెప్పక తప్పదు. ప్రపంచంలోని గొప్ప క్రీడాకారులలో ముహమ్మద్ అలీ ఒకరు. ఇటీవల లెజెండ్ బాక్సర్ కు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బాక్సింగ్ ప్లేయర్స్ తో పాటు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. అలీ (Muhammad Ali) బాక్సింగ్ రింగ్‌లో 10 సెకన్లలో 21 పంచ్‌లను తప్పించుకున్న ద్రుశ్యాలను చూడొచ్చు. (1977) లో ఈ వీడియో షూట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్లిప్ లో మైఖేల్ డోక్స్ అనే బాక్సర్ ముహమ్మద్ అలీల మధ్య తీవ్ర పోరు జరుగుతుంది.

అయితే బాక్సర్ మైఖేల్ అలీని ప్రతిఘటిస్తుంటాడు. అతనిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో 10 సెక్లన్లలో 21 పంచులతో అలీపై విరుచుకుపడుతాడు. కానీ అలీ (Muhammad Ali) తనదైన స్టైల్ తెలివిగా వ్యవహరించి మొత్తం 21 పంచుల నుంచి తప్పించుకుంటాడు. అంతేకాదు.. ప్రత్యర్థి ఆటగాడ్ని వెక్కిరిస్తూ డ్యాన్స్ చేస్తాడు. ఈ వీడియో ఆరు మిలియన్ల  వ్యూస్ తో పాటు 47,000 లైక్స్ కొల్లగొట్టింది. మహమ్మద్ అలీ టైమింగ్ కు ప్రతి అభిమాని ఫిదా అవుతాడు.

‘‘వావ్.. నీ టైమింగ్ సూపర్ అంటూ కొందరు, అలీ ఒక హేయమైన మృగం” అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికన్ బాక్సర్ (Boxer) 1964లో సోనీ లిస్టన్‌ను ఓడించి తన మొదటి ప్రపంచ టైటిల్‌ను సంపాదించాడు అలీ. హెవీవెయిట్ బెల్ట్‌ను మూడుసార్లు గెలుచుకున్న మొదటి వ్యక్తిగా బాక్సింగ్ లో కొత్త చరిత్ర సృష్టించాడు. చివరికి 56 విజయాలతో 1981లో రిటైరయ్యాడు. “ది గ్రేటెస్ట్” అనే పేరుగాంచిన ఉన్న అలీ, 2016లో USAలో 74 ఏళ్ల వయసులో మరణించారు.

Also Read: samantha : ‘శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో సమంత ఎమోషనల్