Site icon HashtagU Telugu

PM MODI : మూడు రోజులపాటు గుజరాత్ లో పర్యటించనున్న మోదీ..14,500కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన..!!

Pmmodiji

Pmmodiji

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ… ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 9 నుంచి 11 వరకు రాష్ట్ర పర్యటన తర్వాత మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని గుజరాత్ పర్యటన సందర్భంగా, రూ. 14,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు మోధేరా, మెహసానాలో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటలకు మోధేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, రాత్రి 7:30 గంటలకు సూర్య దేవాలయంను దర్శించుకోనున్నారు.

రెండవ రోజు పర్యటనలో భాగంగా, అక్టోబర్ 10, ఉదయం 11 గంటల ప్రాంతంలో, ప్రధాని మోదీ బరూచ్‌లోని అమోద్‌లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు అహ్మదాబాద్‌లో మోదీ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు జామ్‌నగర్‌లో ప్రధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.

మూడో రోజు అక్టోబరు 11న, ప్రధాని మోదీ మధ్యాహ్నం 2:15 గంటలకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అసర్వాలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధాని గుజరాత్ పర్యటనలో ఇదే చివరి కార్యక్రమం, ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు.

ఈరోజు మెహసానాలో జరిగే బహిరంగ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. మోధేరాలో రూ.3900 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమం సందర్భంగా, భారతదేశపు మొదటి రౌండ్ ది క్లాక్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా మోధేరా గ్రామాన్ని ప్రధాని ప్రకటించనున్నారు. గ్రామం మొత్తానికి సోలార్ పవర్ ఆపరేషన్ అనేది దేశంలోనే తొలి పథకం.