PM KISAN SCHEME:అన్నదాతలకు శుభవార్త చెప్పిన మోదీ…మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి రూ. 2వేలు జమ..!!

అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయో వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
PM Kisan scheme

PM Kisan scheme

అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయో వెల్లడించింది. దీంతో రైతన్నల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీపావళి కంటే ముందే రైతుల ఖాతాలో రూ. 2వేలను జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైతుల అకౌంట్లోకి 11 విడతల డబ్బు జమ చేసింది. ఇప్పుడు 12వ విడత డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 17న 12వ విడత డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కానున్నాయి. అర్హత కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ఈ నగదు జమ అవుతుంది. ఈ 12వ విడత డబ్బులను అక్టోబర్ 17న ఉదయం 11గంటలకు పీఎం కిసాన్ స్కీం కింద ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు సీఎస్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

  Last Updated: 15 Oct 2022, 07:56 PM IST