Relationship : ఈ తప్పులు అస్సలు చేయకండి..మీ సుఖ సంసాారానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే..!!

మన ప్రవర్తన, సోమరితనం ఇవే కాదు..మన లైంగిక జీవితాన్ని పాడుచేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 12:00 PM IST

మన ప్రవర్తన, సోమరితనం ఇవే కాదు..మన లైంగిక జీవితాన్ని పాడుచేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ శృంగార జీవితం పట్ల మీకు కావలసిన అభిరుచిని చంపే కొన్ని చిన్న అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది.

సంతృప్తి చెందలేదు:
జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతృప్తిపరచలేకపోవడానికి అనేక పరిస్థితులు ఉంటాయి. అప్పుడు నిరాశ చెందకండి. మీ భాగస్వామితో స్వేచ్ఛగా మాట్లాడండి. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామికి బెడ్‌లో ఏమి ఇష్టపడుతున్నారో, మీరు ఎలా ఇష్టపడుతున్నారో వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పాలి. వారు మీకు నచ్చని పనులు చేస్తుంటే సమస్య ఏమిటో మీరు వారికి చెప్పలేకపోతే, మీ సంబంధాన్ని మరింత దిగజార్చుతాయి.

ఆరోగ్య సమస్యలు:
మీకు వైద్యపరమైన సమస్యలు ఉన్నాయని అనుకుంటే, మీ వైద్యుడిని సంప్రదించండి. వాటిని చర్చించండి. కొన్ని సందర్భాల్లో, మీకు సహజంగా తక్కువ టెస్టోస్టెరాన్ ఉండవచ్చు. డాక్టర్ వాటిని సరిదిద్దడానికి మార్గాలను సూచిస్తారు.

ఒత్తిడి:
మీరు ప్రతివిషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురువుతుంటే…శృంగార జీవితంలో తృప్తి ఉండదు. ఇది మీ శృంగార జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒత్తిడి మనల్ని దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టనివ్వదు. కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ స్థాయిలు మీ టెస్టోస్టెరాన్ ఇతర హార్మోన్ల ఉత్పత్తిని అణిచివేస్తాయి.

సరిగ్గా నిద్రలేకపోవడం:
మీరు అన్ని వేళలా అలసిపోవడానికి ప్రధాన కారణం నిద్ర లేకపోవడం. మీరు ఎక్కువగా పని చేస్తుంటే ..మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే అలసిపోతారు. అందువల్ల శృంగారం నుండి దూరంగా ఉంటారు. అందుకోసం మధ్యాహ్నం పూట కునుకు తీయండి. దీనితోపాటుగా ఆహారం జీవనశైలిని మార్చుకోండి.

దంపతుల మధ్య గొడవ:
ప్రతి జంట గొడవపడుతుంది కానీ అది తీవ్రస్థాయికి వెళ్లకూడదు. మీరు మీ భాగస్వామి గొడవలు పడుతుంటే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని ఇష్టపడకపోవడం లేదా మీరు మీ భాగస్వామిని ఇష్టపడకపోవడం వల్ల కావచ్చు. ఇది మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మీరిద్దరూ ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి.