బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లయిన మహిళ ఇంటి పనులు చేయమంటే పనిమనిషిలా అనుకోకూడదంటూ వ్యాఖ్యానించింది. ఇది మహిళ పట్ల క్రూరత్వం కాదు అన్నది. ఇంటిపనులు చేయడం ఇష్టంలేనట్లయితే పెళ్లికి ముందే ఈ కండిషన్ అబ్బాయి తరపు వాళ్లకు చెప్పాలని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ పేర్కొంది. జస్టిస్ విభా కంకన్ వాడి, జస్టిస్ రాజేష్ పాటిల్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడిగే హక్కు ఆ కుటుంబానికి ఉంటుంది. అంతేకానీ ఆమెను పనిమనిషిలా చెప్పలేమని బెంచ్ పేర్కొంది.
మహిళకు తన ఇంటి పనులు చేయాకూడదనుకుంటే…ఆమె పెళ్లికి ముందే చెప్పాలి. తద్వారా వరుడు తరపు వాళ్లు పెళ్లి గురించి ఆలోచిస్తారు. అంతేకానీ పెళ్లయిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తితే అవకాశం ఉంటుంది. అందుకనీ ముందుగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పింది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారన చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని భాగ్యనగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ తన అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేసింది. పెళ్లయిన నెల రోజుల నుంచి తనను హింసిస్తున్నారని మహిళ ఆరోపించింది. అత్తమామ, భర్త తనను పనిమనిషిలా చూస్తున్నారని కంప్లైట్ చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.