Site icon HashtagU Telugu

Viranika: లండన్‌లో లగ్జరీ స్టోర్ బిజినెస్ ను ఆరంభించిన మంచు వారి కోడలు విరానిక

Viranika

Manchu's Daughter In Law Viranika Started A Luxury Store Business In London

మంచు విరానికా (Manchu Viranika) వ్యక్తిగత విషయాల గురించి తెలియకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితం. కానీ, ఆమె అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది. విష్ణుతో వివాహం తర్వాత భారత్ కు వచ్చింది. పెళ్లి తర్వాత తన కుటుంబ సభ్యులకు కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేదట. కొద్ది రోజులుగా భారత్ లో విరానికా (Viranika) అనే పేరుతో బోటిక్ రన్ చేసింది. ప్రస్తుతం లండన్ వేదికగా తన బిజినెస్ ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది.

లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసిన మంచు విష్ణు సతీమణి

కేవలం చిల్డ్రన్ కోసం  మైసన్ అవా పేరుతో ఈ స్టోర్ ఓపెన్ చేసింది. 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పిల్లల వరకు ఇందులో దుస్తులు లభించనున్నాయి.  అబ్బాయిలు,  అమ్మాయిల కోసం అన్ని రకాల ఖరీదైన, సరికొత్త డిజైన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ ఉన్న దుస్తుల్లో చాలా వరకు మిషన్ మీద కాకుండా చేతితో తయారు చేసినవే ఉన్నయట. విరానికా లండన్ లో తన వస్త్రవ్యాపారం మొదలు పెట్టడంపై అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. బిజినెస్ సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగాలని కోరుతున్నారు.

స్టోర్ ని లండన్ లో ఓపెన్ చేయడంపై విరానికా (Viranika) సంతోషం

లండన్ లో స్టోర్ ఓపెన్ చేయడంపై విరానికా సంతోషం వ్యక్తం చేసింది. లండన్ హారోడ్స్ లో తమ బ్రాండ్ ఓపెన్ చేయాలనుకునే కల నిజమైనట్లు వెల్లడించింది. “లండన్ హారోడ్స్ మా బ్రాండ్ ఓపెన్ చేయాలనే నా కల నిజమైంది. నలుగురి పిల్లలకి తల్లిగా, నేను చాలా సంవత్సరాలు హారోడ్స్ లో కస్టమర్‌గా ఉన్నాను. ఎలాంటి దుస్తులు పిల్లలకు బాగుంటాయో నాకు సంపూర్ణ అవగాహన ఉంది. షాప్ ఫ్లోర్‌లో మా దుస్తులు చూడటం చాలా ఆనందంగా ఉంది. ‘మైసన్ అవా’ అనేది నా అభిరుచికి తగినట్లుగా, అత్యుత్తమ భారతీయ హస్తకళతో రూపొందించబడింది. విశిష్ట అభిరుచి కలిగిన హారోడ్స్ కస్టమర్‌లకు మా దుస్తులను అందుబాటులో ఉంచడం ఆనందంగా ఉంది. వారికి మా డిజైన్లు నచ్చుతాయని భావిస్తున్నాను” అని తెలిపింది.

‘మైసన్ అవా’ వ్యవస్థాపకురాలు, క్రియేటివ్ డైరెక్టర్ విరానికా న్కూయార్క్ లో పుట్టి అక్కడే చదువుకుంది. చిన్న వయస్సులోనే డిజైన్, లగ్జరీ దుస్తుల పట్ల మక్కువ పెంచుకుంది.  చదువు తర్వాత, నగల రూపకల్పనలో తన ఎక్స్ పీరియెన్స్ పెంచుకోవడానికి భారత్ కు వచ్చింది. ఫ్యాషన్ రంగంలో అనేక మెళకులవను నేర్చుకుంది. ఆమె రూపొందించే దుస్తులు త్వరగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటాయి.  ఆ మంచు విష్ణుతో పెళ్లి తర్వాత ఆమె భారత్ లోనే కొంత కాలం పాటు ఉంది. ప్రస్తుతం లండన్ లో ఉంటోంది.

Also Read:  Nityananda: మైక్రో నేషన్స్ కలకలం: నిత్యానంద కైలాస దేశం నుంచి రజనీష్‌పురం దాకా..

Exit mobile version