Site icon HashtagU Telugu

Viral Donkey: గాడిద సింహంలా గర్జించింది.. హింసించిన యజమానికి శాస్తి!!

Donkey Imresizer

Donkey Imresizer

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కోపిష్టి, పాపిష్టి యజమాని కి గాడిద బుద్ధి చెప్పిన తీరును నెటిజన్స్ సమర్ధిస్తున్నారు.

ఓ గాడిదను దాని యజమాని ఇష్టారాజ్యంగా కొట్టాడు. కాలితో తన్నాడు. చెంపదెబ్బలు కొట్టాడు. అయినా ఆ మూగ జీవి చూస్తూ నిలబడింది. ఎందుకంటే… దాని మెడకు ఉన్న తాడును అతను పట్టుకున్నాడు. ఆ తాడును అతగాడు వదిలాక గాడిద యాక్టివ్ అయింది. తన వీపుపై ఎక్కి మరింతగా కొడుతుంటే… అది రివర్స్ అయ్యింది. అతని కాలును కొరికేసి… కిందపడేసి లాగేసింది. దీంతో అతను గావుకేకలు పెట్టాడు. అయినా గాడిద వదల్లేదు.

తన జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపించింది. “అంత కొట్టిన తర్వాత ఆ గాడిద ఎందుకు ఊరుకుంటుంది. అందుకే.. తన పేబ్యాక్ టైమ్ రాగానే తీర్చేసుకుంది” అని నెటిజన్స్ కామెంట్ చేశారు.ఈ వీడియోను జులై 29న ఇన్‌స్టాగ్రామ్ లోని shaktikapoor పేజీలో పోస్ట్ చేశారు. దీన్ని 1.30 లక్షల మందికి పైగా చూశారు. 27 వేలకి పైగా లైక్ వచ్చాయి. మానసిక వేత్తల ప్రకారం.. ఈ వీడియో నచ్చింది అనే వారందరికీ జాలి హృదయం ఉంటుంది. అలాంటి వారు పైకి ప్రశాంతంగా ఉన్నా… లోలోపల చెడును చూస్తూ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగని వారు హింసా మార్గాన్ని అనుసరించరు. లోలోపలే ఫీలవుతూ ఉంటారు. కానీ ఎవరైనా అన్యాయాన్ని ఎదుర్కొంటే మాత్రం సంతృప్తి చెందుతారు.