Lion Love: సింహానికి ముద్దు పెట్టిన వ్యక్తి.. జంతు ప్రేమకు నెటిజన్స్ ఫిదా!

పెట్స్ డాగ్స్ వేరు.. వైల్డ్ యానిమల్స్ వేరు. కుక్కులతో ఉన్నట్టు సింహలతో ఉండటం అసలు కుదరదు.

Published By: HashtagU Telugu Desk
Lion

Lion

పెట్స్ డాగ్స్ వేరు.. వైల్డ్ యానిమల్స్ వేరు. కుక్కలతో ఉన్నట్టు సింహలతో ఉండటం అసలు కుదరదు. సింహమే కదా.. రిస్క్ చేసి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారో ఇక అంతే సంగతులు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి  మాత్రం సింహంతో సరాదాగా ఆడుకోవడమే కాదు.. ఏకంగా ముద్దులు కూడా పెడతాడు. ఆ సింహం కూడా ఆ వ్యక్తిని ముద్దాడుతూ తన ప్రేమను ఒలకబోస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రేమతో, గౌరవంగా వ్యవహరిస్తే, బెదిరించకుండా ఉంటే, సింహాలు కూడా మనుషులతో మంచి స్నేహితులుగా మారుతాయి అనడానికి ఈ వీడియోను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్న వీడియో అందరి మనసులను దోచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లయన్‌లవర్‌షబ్’ అనే పేరుతో పోస్ట్ చేసిన వీడియో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది.

రీల్ లో 3.6 మిలియన్లకు వ్యూస్,  213k లైక్‌లతో వైరల్‌గా మారింది. అతను సరాదాగా సింహంతో ఆడుతూ సేద తీరుతూ కనిపించాడు. అతను దానికి ముద్దు పెట్టగా, సింహం కూడా ముద్దు పెట్టి ప్రేమను చాటుకుంది. వీడియోను చూసిన నెటిజన్స్ చాలామంది “ఆ వ్యక్తి ఇంకా అదృష్టవంతుడు” అని కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను మీరు కూడా చూసేయ్యండి.

  Last Updated: 30 Nov 2022, 05:51 PM IST