Site icon HashtagU Telugu

Viral Video: డిస్టర్బ్ చేసిన వ్యక్తిని.. తన్ని తరిమేసిన ఆవుల మంద!!

Cattlen Imresizer

Cattlen Imresizer

కోతి చేష్టలు ఒక్కోసారి కొంప ముంచుతాయి..ముచ్చెమటలు పట్టిస్తాయి.చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగేలా చేస్తాయి.

ఇటువంటి చేదు అనుభవమే తాజాగా ఒక వ్యక్తికి ఎదురైంది.

ప్రశాంతంగా పచ్చిక బయళ్ల నడుమ గడ్డి మేస్తున్న ఆవులు, గేదెలను అతడు కెలికాడు. డిస్టర్బ్ చేశాడు. అవి మాత్రం ఎందుకు ఊరుకుంటాయి ? అతడిని అక్కడి నుంచి తన్ని తరిమేశాయి. మామూలుగా తరమలేదు. కిందపడి బోర్లుతూ.. లేస్తూ.. పరుగులు పెడుతూ అతడు ఉరుకులు పరుగులు పెట్టాడు.

ఒకవేళ అతడు గనక వాటికి చిక్కి ఉంటే.. ఆవులు కొమ్ములతో కుమ్మేసి ఉండేవి. రన్నింగ్ రేస్ పెట్టారా అనుకునేంత స్పీడ్ లో పరుగులు పెట్టి.. ఆవుల మంద బారి నుంచి తప్పించుకున్నాడు. పక్కనే ఉన్న చిన్నపాటి కాల్వలోకి దూకాడు. వేగంగా వచ్చిన ఆవులు ఆ కాల్వ గట్టు దగ్గర కాసేపు నిలబడి వెనక్కి వెళ్లిపోయాయి. కొస మెరుపు ఏమిటంటే.. ఆ వ్యక్తి కాల్వలోకి దూకే ముందు, ఓ కుక్క పిల్ల కూడా ఆవుల మందకు భయపడి పరుగులు పెట్టింది.

అది కూడా చాకచక్యంగా కాల్వను దాటింది. ఇంతకీ ఆ కుక్క పిల్ల అక్కడికి ఎలా వచ్చిందనేది పెద్ద మిస్టరీగా మిగిలింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ప్రకృతి ప్రశాంతత కు భంగం కలిగితే ఇలాగే స్పందిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. జంతుజాతులను మనుషులు డిస్టర్బ్ చేస్తే వాటికి ఎంతటి ఆగ్రహం వస్తుందో తెలిపేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని ఇంకొందరు వ్యాఖ్యానించారు.