Owaisi : హైదరాబాదీ బిర్యానీతో ఓటర్లకు గాలం..!!

2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయపార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. మధ్యప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 11:24 AM IST

2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయపార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి.  ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇందుకోసం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.  జనాలకు  మరింతగా దగ్గరయ్యేందుకు ‘అతిథి దేవోన్‌ భవ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాదీ బిర్యానీతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీలో ఇండియాలో చాలా ఫేమస్ కాబట్టి…ఓటర్లకు రుచి చూపించాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఇప్పటి వరకు తమ పార్టీకి ఇప్పటి వరకు లక్షలమందికిపైగా ఓటర్లు ఉన్నారని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.

అతిథిదేవోన్ భవ కార్యక్రమంలో భాగంగా పార్టీకి హాజరైన వారికి రుచికరమైన హైదరాబాదీ బిర్యానీ అందిస్తున్నట్లు నరేలా సీటు అభ్యర్థి పీర్జాడ తౌకీర్ నిజామీ తెలిపారు. నరేలాలో తమ పార్టీలో 25వేల మంది సభ్యత్వం తీసుకున్నట్లు చెప్పారు. కాగా భోపాల్ లోని నరేలా నియోజకవర్గంలో 40శాతం ముస్లిం వర్గాలకు చెందినవారు దాదాపు 25వేల మంది పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐఎంఐఎం 10లక్షల కంటే ఎక్కువ మందికి పార్టీ సభ్యత్వం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో నరేలా ఓటర్లకు హైదరాబాద్ బిర్యానీతో గాలం వేస్తున్నారు. కాగా ఎన్నికల్లో తమ పార్టీదే విజయం అంటూ ఓవైసీ మద్దతుదారులు ఇప్పటికే ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భారీగా ఏంఐఏంఐఎలోకి వసలు జోరందుకున్నాయి.

కాగా 2023 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని 50స్థానాల్లో పోటీ చేసేందుకు ఏఐఎంఐఎం రెడీ అవుతోంది. భోపాల్, ఇండోర్, జబల్ పూపర్, ఖాండ్యా, ఖర్గోన్, బుర్హాన్ పూర్ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రచారన్ని మొదలుపెట్టారు. ఈమధ్యే జరిగిన అర్బన్ బాడీ ఎలక్షన్స్ లో ఖాండ్వా, బుర్హాన్ పూర్ తో సహా అనేక నగరాల్లో సుమారు 7మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. దీంతో 2023ఎన్నికలే టార్గెట్ గా ఏఐఎంఐఎం ప్రయత్నాలు ప్రారంభించింది.