సామాన్యులకు శుభవార్త. కేంద్రం ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 115.5 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవు. జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!
ఢిల్లీలో 19 కిలోల ఇండేన్ ఎల్‌పిజి సిలిండర్ కొత్త ధర ఇప్పుడు రూ. 1744గా ఉంది. ఇది గతంలో రూ. 1859.5.గా ఉంది. 1844లో ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర…ఇప్పుడు రూ. 1696కు అందుబాటులోకి రానున్నాయి. చెన్నైలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1893, దీనికి ముందుగా రూ. 2009.50 చెల్లించాల్సి ఉంటుంది. కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1846గా ఉంది. ఇది గతంలో రూ.1995.50.గా ఉండేది.
ప్రజలకు ఉపశమనం ఇస్తూ, వాణిజ్య LPG ధరలను ప్రభుత్వం తగ్గించింది. అయితే దేశీయ ఎల్‌పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను మాత్రమే ప్రభుత్వం రూ.115.50 తగ్గించింది.