Lions couple Disturbed : గుజరాత్ లోని గిర్ అభయారణ్యం సింహాలకు ఫేమస్..
అక్కడ పెద్ద సంఖ్యలో సింహాలు ఉన్నాయి..
దీంతో గిర్ అభయారణ్యం పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు..
లేటెస్ట్ గా ఓ ఘటన ఆ ఊళ్లలో వణుకు పుట్టించింది..
తాజాగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అభయారణ్యం ప్రాంతంలో పశువులను మేపుతూ నీటికుంట వైపు తీసుకెళ్తున్న విక్రమ్ చావ్దా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహం ఎటాక్ చేసింది.. విశావదర్ తాలూకాలోని రాజప్రా ఫారెస్ట్ రౌండ్‌లో భాగమైన బాగోయా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సింహాల జంట అడవిలో ఒక చోట సంభోగం చేస్తుండగా.. బాలుడు పశువులను మేపుతూ అటువైపుగా వెళ్ళాడు. దీంతో ఆ సింహాల జంట ఎంతో డిస్టర్బ్ అయింది. వాటి నేచురల్ యాక్టివిటీకి ఆటంకం(Lions couple Disturbed) కలిగింది.
Also read : OYO Hotels: ప్రపంచ కప్ నేసథ్యంలో కొత్తగా 500 OYO హోటల్స్
బాలుడిని చూడగానే రెచ్చిపోయిన సింహం .. అతడిపై అటాక్ చేసేందుకు ఉరికి వచ్చింది. వేగంగా వచ్చి బాలుడి తొడ, వీపు భాగంపై పంజా విసిరింది. ఇంకొన్ని సెకన్లు అయితే బాలుడు పూర్తిగా సింహం పంజాకు చిక్కేవాడు. సరిగ్గా ఈ టైంలో బాలుడి అరుపులు విని దగ్గర్లో ఉన్న పశువుల కాపరులు అలారం సౌండ్స్ పెట్టారు. దీంతో సింహం అక్కడి నుంచి పారిపోయింది. బాలుడికి తొలుత విసవదర్‌లోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి.. జునాగఢ్ సివిల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈవివరాలను గిర్ (వెస్ట్) ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) ప్రశాంత్ తోమర్ వెల్లడించారు.