టెక్నాలజీ రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్లో కొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో మొబైల్ ఫ్లిప్ ఫోన్ల తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్ ఫ్లిప్ మోడల్ ను లెనోవో (LENOVO ) కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఫ్లిప్ ల్యాప్టాప్ సరికొత్త డిజైన్ తో మార్కెట్లోకి వచ్చింది. సాధారణంగా 13.9 ఇంచుల డిస్‌ప్లేతో పనిచేసే ఈ ల్యాప్టాప్, ఫ్లిప్ ఓపెన్ చేస్తే 18.1 ఇంచుల OLED డిస్‌ప్లేగా మారుతుంది. అంతే కాదు ల్యాప్టాప్ 120Hz టచ్ స్క్రీన్‌తో వస్తుండటంతో మరింత ఆకర్షణీయంగా మారింది.
Tata Punch Sales: టాటా పంచ్ విక్రయాల్లో భారీ క్షీణత.. ఫిబ్రవరిలో ఎన్ని అమ్ముడుపోయాయంటే?
లెనోవో విడుదల చేసిన ఈ ఫ్లిప్ ల్యాప్టాప్ పనితీరులో ప్రత్యేకతను కలిగి ఉంది. దీని మందం 16.9 మిల్లీమీటర్లు మాత్రమే ఉండగా, బరువు 1.4 కిలోలుగా ఉంది. దీంతో ఇది సులభంగా పోర్టబుల్‌గా మారి, ఎక్కడికైనా తీసుకెళ్లేలా ఉండేలా డిజైన్ చేశారు. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్ వంటి వారికీ ఇది ఉపయోగపడేలా ఉంటుంది. దీని ద్వారా ప్రొడక్టివిటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా మల్టీటాస్కింగ్ కోసం ఇదొక సరికొత్త పరిష్కారంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ల్యాప్టాప్‌ను వంచి వాడేలా ఉండటంతో దీని వినియోగంలో కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది.
TGPSC : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల
దీని ధరపై ఇంకా లెనోవో అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే దీని అధునాతన ఫీచర్లు, OLED స్క్రీన్, అధిక Refresh Rate ను పరిగణలోకి తీసుకుంటే దీని ధర ప్రీమియం రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. లెనోవో ఇదివరకే ఫోల్డబుల్ ల్యాప్టాప్ మోడల్స్ విడుదల చేసినప్పటికీ, ఈ కొత్త ఫ్లిప్ ల్యాప్టాప్ టెక్ మార్కెట్లో సంచలనాన్ని సృష్టించనుందని భావిస్తున్నారు. త్వరలోనే దీని పూర్తి వివరాలను, ధరను కంపెనీ వెల్లడించనుంది.