Site icon HashtagU Telugu

Pension Scheme : ఉద్యోగం చేయకపోయినా ప్రతి నెల పెన్షన్ పొందాలంటే ఇలా చేయండి..!!

Fact Check

Money

మీరు ఏదైనా పెన్షన్ పథకంలో చేరి వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకంలో చేరడం ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు. ఎలాగో చూడండి

పదవీ విరమణ అనంతర పెన్షన్ సీనియర్ సిటిజన్లకు అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అందుకే తమ రిటైర్మెంట్ అవసరాలను గుర్తించి ఇప్పుడే పొదుపు చేయడం ప్రారంభించాలి. పదవీ విరమణ తర్వాత ఖర్చులను అంచనా వేసి, మీకు ప్రతి నెల ఎంత పెన్షన్ అవసరమో లెక్కించి, అందుకు అనుగుణంగా పొదుపు చేస్తే, ఎలాంటి సమస్య లేదు.

కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను అందజేస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వాటిలో ఒకటి. దీనిని నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా మీరు నెలకు రూ.1,00,000 వరకు పెన్షన్ పొందవచ్చు. కానీ పెన్షన్ పొదుపు మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

చిన్న వయస్సులోనే జాతీయ పెన్షన్ పథకంలో చేరడం చాలా ప్రయోజనకరం. ముందు చూపుతో పొదుపు చేస్తే మంచి రాబడి, అధిక పెన్షన్ లభిస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా పెన్షన్ పొందవచ్చు.

మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో టైర్ 1 ఖాతాను ఎంచుకుంటే, మీరు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. సబ్‌స్క్రైబర్ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో 60 శాతం కార్పస్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని నెలవారీ పెన్షన్‌గా మార్చుకోవచ్చు.

ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్లు అంటే 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తే, అతనికి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకోండి. వార్షిక వడ్డీ రేటు 10 శాతం, యాన్యుటీ రేటు 6 శాతం ఉంటే, యాన్యుటీ ఈ క్రింది విధంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2004 జనవరిలో జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని కూడా అంటారు. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఈ పథకం 2009లో అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చింది. 18, 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా జాతీయ పెన్షన్ పథకంలో పొదుపు చేయవచ్చు. మీరు టైర్ 1 ఎంపికను ఎంచుకుంటే, మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంది. మిగిలిన 40 శాతం యాన్యుటీగా పొందవచ్చు. మీరు టైర్ 2 ఎంపికను ఎంచుకుంటే, మీరు నెలకు కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.