Site icon HashtagU Telugu

Hindu Posters: దేవుడు నన్ను ప్రత్యేకంగా పంపాడు..హిందూ వ్యతిరేక పోస్టర్లపై కేజ్రీవాల్..!!

Arvind Kejriwal

Arvind Kejriwal (2)

గుజరాత్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వార్ తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. తాను తాను కృష్ణాష్టమి నాడు జన్మించాననీ..కంసుని వారసులను అంతం చేసేందుకు దేవుడు తనను ప్రత్యేకంగా పంపించాడని అన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేకి అంటూ వెలువడిన పోస్టర్లపై కేజ్రివాల్ స్పందించినట్లుగా అర్ధమవుతుంది. పోస్టర్లు, బ్యానర్లలో దేవుడిని కించపరిచే పదాలు ఉన్నాయని..గుజరాతీ ప్రజలు బాధ్యులను శిక్షిస్తారన్నారు.

వడోదరలో ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. పోస్టర్లు వేసినవారు దేవుడిని అవమానించే పదాలు ఉపయోగించారన్నారు. వారు దేవుడిని అవమానించారు. వారు నన్ను ఎంతగా ద్వేషిస్తారు..వారు పోస్టరులో దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. అలాంటి వారికి ఇక్కడి ప్రజలు బుద్దిచెబుతారన్నారు. , తాను కంసుని వంశ‌స్థుల‌ను అంతం చేయ‌డానికి దేవుడు తనను ప్రత్యేకంగా పంపించాడాని.. హనుమంతునికి గొప్ప భక్తుడుని అంటూ కేజ్రీవాల్ చెప్పారు.

కాగా గుజరాత్ లో చాలా నగరాల్లో హిందూ వ్యతిరేకి అనే నినాదంతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అందులో కేజ్రివాల్ చిత్రాలు కనిపించాయి. గుజ‌రాత్ అసెంబ్లీకి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆప్ దూకుడు పెంచింది. పంజాబ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించిన ఉత్సాహంతో ఇక్క‌డ కూడా మంచి ఫ‌లితాలు రాబ‌ట్టే ప్రయత్నం చేస్తోంది.