CJI: భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..!!

  • Written By:
  • Updated On - November 9, 2022 / 02:19 PM IST

జస్టిస్ డివై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.  ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 7వ తేదీన పదవీ విరమణ చేశారు. మంగళవారం గురునానక్ జయంతి సెలవు కావడంతో యుయు లలిత్ ఒకరోజు ముందుగానే పదవివిరమణ చేశారు. ఆయన స్థానంలో 50వ చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా చంద్రచూడ్ నవంబర్ 10,2024వరకు 2ఏళ్లపాటు సీజేఐగా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 11న తన తదుపరి వారసుడిగా యుయు లలిత్ …డీవై చంద్రచూడ్ ను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించున్నారు. డీవై చంద్రచూడ్ తండ్రి డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువకాలం పనిచేశారు. 1978 ఫిబ్రవరి 22 నుంచి జూలై 11.1985వరకు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా కొనసాగారు.