Site icon HashtagU Telugu

Celestial Wonder : ఈ రాత్రికి ఆకాశంలో అరుదైన అద్భుతం

Jupiter

Jupiter

సోమ‌వారం రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురుగ్రహం భూమికి అత్యంత సమీపంగా రానుంది. శని, బృహస్పతి, భూ గ్రహాలు మూడూ ఒకే రేఖలో కనిపించనున్నాయి. గురుగ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1963 లో ఇది సాధ్యమైంది.మ‌ళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే. 107 ఏళ్ల తర్వాత 2129 లో మళ్లీ గురుడు భూమికి చేరువగా వస్తాడు. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే అవ‌కాశం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు రెండు గ్రహాల మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్ల) కిలో మీట‌ర్లు ఉంటుంది. దూరంగా వెళ్లినప్పుడు భూ – గురు గ్రహాల మధ్య 96,56,06,400 (96.56కోట్ల) కిలో మీట‌ర్లు వ్యత్యాసం ఉంటుంది. సౌరవ్యవస్థలో అతిపెద్దదైన గురుగ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది.

Exit mobile version