Site icon HashtagU Telugu

Viral Video Workout: గగన సీమపై సాహస వనిత.. విమానానికి వేలాడుతూ వర్కౌట్స్

Viral Video Imresizer

Viral Video Imresizer

సాహసం ఎవరి సొత్తూ కాదని ఆమె నిరూపించింది.

పురుషులకు ఎంత ధైర్యం ఉంటుందో.. స్త్రీలకూ అంతే ధైర్యం ఉంటుందని చాటి చెప్పింది..

వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానానికి వేలాడుతూ.. ఆ మహిళ చేసిన వర్కౌట్లు అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తాయి. విమానాన్ని పట్టుకొని వర్కౌట్లు చేయడమే కాదు.. అక్కడి నుంచి స్కై డైవింగ్‌ కూడా చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. స్కైడైవర్‌ కేటీ వసేనినా తన ఫీట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఆ క్లిప్పింగ్‌ను దాదాపు 5 కోట్ల మంది చూశారు. 5.7 లక్షల మంది లైక్‌ చేశారు. వసేనినా సాహసాన్ని పొగిడేస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అద్భుత ఫీట్‌. ఊపిరి బిగబట్టేలా చేశావు’ అని పలువురు కామెంట్స్ పెట్టారు. ‘నాకు అది గుండెపోటును తెప్పించేలా అనిపించింది. కానీ, నువ్‌ మాత్రం సులభంగా చేసేశావు’ అని పలువురు వ్యాఖ్యానించారు.

ఇండోర్ స్కైడైవింగ్ మన హైదరాబాద్ లో..

ఎక్కడో విదేశాల్లో వారు చేసిన వీడియోలను అంతా కళ్లప్పగించి చూస్తుంటాం. అయితే అలాంటి  ఇండోర్ స్కైడైవింగ్ దేశంలోనే మొదటిసారిగా ప్రస్తుతం హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి రానుంది.
దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు.దీనిని దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో స్థాపించేందుకు గ్రావిటీ జిప్ అనే సంస్థ రంగం సిద్ధం చేస్తోంది.
హైదరాబాద్‌కే చెందిన మేడ రామ్, మేడ సుశీల్‌లు దీనిని స్థాపించనున్నారు.తద్వారా హైదరాబాద్ వాసులు, ఇక్కడికి వచ్చే వారు ఈ సరికొత్త అనుభూతిని పొందొచ్చు.