సోషల్ మీడియా (Socal Media) వాడకం ఏ రేంజ్ లో పెరిగిందో తెలియంది కాదు..ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఇంటర్ నెట్ …ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా విస్తరించడం..ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం తో సోషల్ మీడియాకు బాగా అలవాటుపడ్డారు. దీంతో సరికొత్త యాప్స్ అందుబాటులోకి వస్తూ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇన్‌స్టాగ్రామ్ (Instagram ) అనేది ఇప్పుడు హల్చల్ చేస్తుంది.
సోషల్ మీడియా యాప్ లలో ఎంతో పాపులార్టీ సంపాదించుకున్న యాప్ ఇన్‌స్టాగ్రామ్. యువత ఎక్కువగా ఈ యాప్ ను వాడుతున్నారు. ప్రైవసీ తో పాటు ఫీచర్స్ కూడా ఆకట్టుకోవడంతో ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ (Instagram features) అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇన్‌స్టా స్టోరీలు ఇంతలా పాపులర్ కావడానికి ప్రధాన కారణం పాటల లిరిక్స్‌ను యాడ్ చేసే ఫీచర్ ఉండడమే. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను రీల్స్‌కు కూడా యాడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ విషయాన్ని స్వయంగా మెటా అధినేత (Zuckerberg) తెలిపారు. రీల్స్‌లోని పాటలకు లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే మనమే స్వయంగా టైప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై అవసరం ఉండని జుకర్ బర్గ్ తెలిపారు. రీల్స్‌కు భారీగా ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు..ఇక ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ క్రియేట్ చేసి మ్యూజిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, మీకు కావాల్సిన పాటను సెలక్ట్ చేసకొని.. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయగానే లిరిక్స్ వీడియోకు యాడ్ అవుతుంది.. ఈ ఫీచర్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Protecting Your Lungs: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!