Site icon HashtagU Telugu

Indigo : ఇండిగో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు…టేకాఫ్ నిలిపివేత…తప్పిన ముప్పు..!!

Indigo

Indigo

ఢిల్లీ నుంచి బెంగుళూరు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టేకాఫ్ చేయకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. పైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఫ్లైట్ లో 177మంది ప్రయాణికులు, 7మంది సిబ్బంది ఉన్నారు. వారంతా సేఫ్ గా ఉన్నారు. వారందర్నీ సురక్షితంగా టెర్మినల్ భవనానికి తరలించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

జాతీయమీడియా కథనం ప్రకారం…ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న విమానం (6E-2131)లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగడంతో…ఫ్లైట్ లో కూర్చున్న ప్రయాణికులు కిటికీలో నుంచి ఇంజిన్ లో మంటలు రావడాన్ని గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది జరిగినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10గంటలకు జరిగింది.

Exit mobile version