Site icon HashtagU Telugu

Indian Flag : భూమికి 30 కిలోమీటర్లపైన మువ్వన్నెల జెండా…వైరల్ వీడియో…!!

Space Kidz India

Space Kidz India

స్వాతంత్ర్య వజ్రోత్సవాన దేశం నలుమూలలా మువ్వన్నెల రంగులతో వెలుగొందుతోంది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశానికి త్రివర్ణ పతాకాలు కొత్తందాలు తీసుకువచ్చాయి. ఈ పతాకాలు రెపరెపలాడుతుంటే…చూసేందుకు రెండు కన్నులు చాలడం లేదు. త్రివర్ణ జెండా కేవలం భూమికే పరిమితం కాలేదు. ఈ నేలకు పైన 30కిలోమీటర్ల ఎత్తులోనూ ఓ జాతీయ జెండా ఎగురుతూ నింగికే అందాన్ని తీసుకువచ్చింది. స్వాతంత్య్రవజ్రోత్సవాలను పురస్కరించుకుని స్పేస్ కిడ్జ్ ఇండియా అనే సంస్థ బెలూన్ సాయంతో 1,06,000అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది.

కాగా స్పేస్ కిడ్జ్ ఇండియా అనేది దేశానికి యువ శాస్త్రవేత్తలను అందించేందుకు సాయపడుతున్న సంస్థ. హద్దులు లేని ప్రపంచం కోసం చిన్నారుల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ మధ్యే లోఎర్త్ అర్బిటర్ లోకి ఉపగ్రహం ఆజాదీశాట్ ను ప్రయోగించింది. దేశవ్యాప్తంగా 750మంది విద్యార్థినులతో ఈ ఉపగ్రహాన్ని డెవలప్ చేసింది. అయితే దీన్ని మోసుకెళ్లిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టడంలో మాత్రం విఫలమైంది.

ఇక దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అంతరిక్షం నుంచి కూడా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. వ్యోమగామి సమంతా ఒక వీడియో సందేశాన్ని పంపుతూ భారత్ 75 వసంతాల స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాన్ వ్యోమగామి రాజాచారి ఆసక్తికర ఫొటోలు షేర్ ఛేశారు.

Exit mobile version